గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో 2030 కామన్ వెల్త్ క్రీడలు జరగనున్నాయి. కామన్ వెల్త్ స్పోర్ట్స్ సర్వసభ్య సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో త్వరలో నిర్వహణ కోసం ప్రత్యేక ఆర్గనైజింగ్ కమిటీ ఏర్పాటు చేయనున్నారు. ఈ క్రీడల కోసం సుమారు రూ.3,000 నుండి రూ.5,000 కోట్ల వరకు వ్యయం అవుతుందని అంచనా, అయితే ఖర్చు వివరాలు ఇంకా ఖరారు కాలేదు.