అమెరికాలో 2,100 విమానాలు రద్దు

అమెరికా ప్రభుత్వ షట్‌డౌన్‌ ప్రభావంతో ఆదివారం 2,100కు పైగా విమానాలు రద్దు కాగా, 7,000కిపైగా విమానాలు ఆలస్యమయ్యాయి. సిబ్బంది కొరత కారణంగా విమాన రాకపోకలను 10% వరకు తగ్గించాలని ఫెడరల్‌ ఏవియేషన్‌ అడ్మినిస్ట్రేషన్‌ (FAA) ఆదేశించింది. షట్‌డౌన్‌ ఇలాగే కొనసాగితే విమాన రవాణా పూర్తిగా స్థంభించవచ్చని రవాణా కార్యదర్శి షాన్‌ డఫీ హెచ్చరించారు. కాగా, అక్టోబర్‌ 1 నుంచి ఇప్పటి వరకూ 40 లక్షల మంది ప్రయాణికులు అంతరాయానికి గురయ్యారని ఎఫ్‌ఏఏ తెలిపింది.

సంబంధిత పోస్ట్