నాలుగు రాష్ట్రాల ఓటర్ల జాబితా నుంచి 22.55 లక్షల ఓట్లు తొలగింపు

ప్రత్యేక సమగ్ర సవరణ (సర్‌) తర్వాత, ఎన్నికల సంఘం (ఈసీ) ఒడిశా, మణిపూర్‌, మిజోరాం, సిక్కిం రాష్ట్రాల్లోని ఓటర్ల జాబితా నుంచి సుమారు 22.55 లక్షల ఓట్లను తొలగించింది. ఇది ఆయా రాష్ట్రాల మొత్తం ఓట్లలో (3.68 కోట్లు) 6.12 శాతంగా ఉంది. మరణం, శాశ్వత చిరునామా మార్పు, బహుళ ప్రాంతాల్లో ఓటరుగా నమోదు వంటి కారణాలతో ఈ ఓట్లను తొలగించినట్లు ఈసీ తెలిపింది. ఈసీ ఆదివారం ఈ నాలుగు రాష్ట్రాల ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రచురించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్