దేశంలో 22 ఫేక్‌ యూనివర్సిటీలు

దేశంలో 22 ఫేక్‌ యూనివర్సిటీలు పనిచేస్తున్నాయని యూజీసీ (UGC) హెచ్చరించింది. ముఖ్యంగా దిల్లీ కోట్లా ముబారక్‌పుర్‌లోని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ ఇంజినీరింగ్‌ అనుమతిలేకుండా డిగ్రీ కోర్సులు నిర్వహిస్తున్నట్లు తెలిపింది. ఆ సంస్థ జారీ చేసే సర్టిఫికెట్లు చెల్లుబాటు కావని స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా 22 గుర్తింపులేని విశ్వవిద్యాలయాల్లో 9 దిల్లీలో, 5 ఉత్తర్‌ప్రదేశ్‌లో, మిగిలినవి కేరళ, పశ్చిమబెంగాల్‌, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌, పాండిచ్చేరిలో ఉన్నాయని పేర్కొంది.

సంబంధిత పోస్ట్