రష్యా ఆర్మీలో 227 మంది భారతీయులు

రష్యా సైన్యంలో చేరిన 227 మంది భారతీయులలో 51 మంది ప్రాణాలు కోల్పోయారని, 139 మందిని విడుదల చేశారని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. మిగిలిన వారిని త్వరగా స్వదేశానికి తీసుకురావడానికి రష్యాాతో చర్చలు జరుగుతున్నాయని విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ తెలిపారు. కిర్గిస్థాన్ పర్యటన సందర్భంగా బిష్కెక్‌లో జరిగిన మీడియా సమావేశంలో ఈ వివరాలు వెల్లడించారు. మాస్కోలోని భారత రాయబార కార్యాలయం పరిస్థితిని పర్యవేక్షిస్తోందని, మిగిలిన భారతీయులను కుటుంబాల వద్దకు చేర్చడమే ప్రభుత్వ ప్రాధాన్యమని స్పష్టం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్