పశ్చిమాసియా ఘర్షణల్లో 23 మంది భారతీయుల మృతి

పశ్చిమాసియాలో ఫిబ్రవరి నుంచి జరుగుతున్న ఘర్షణల వల్ల 23 మంది భారతీయులు మరణించినట్లు భారత విదేశాంగశాఖ వెల్లడించింది. వీరిలో 15 మంది నావికులు ఉన్నారు. సోమవారం ఒమన్ తీరంలో నౌకపై జరిగిన దాడిలో ఒకరు మరణించినట్లు తెలిపింది. అయితే సిబ్బందితో పాటు చనిపోయిన వ్యక్తి మృతదేహాన్ని భారతదేశానికి తరలించేందుకు చర్యలు చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు. ఆ ప్రాంతంలో శాంతిని పునరుద్ధరించేందుకు చర్చలు, దౌత్య మార్గాలను అనుసరించాలని భారత్ పిలుపునిచ్చింది.

సంబంధిత పోస్ట్

✕
✕