చత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులకు తీవ్ర ఎదురుదెబ్బ తగిలింది. PLGA బెటాలియన్‌లో కీలకంగా పనిచేసిన 8 మందితో సహా మొత్తం 23 మంది మావోయిస్టులు లొంగిపోయారు. వీరిపై రూ.1.18 కోట్ల రివార్డులు ఉన్నట్టు అధికారులు తెలిపారు. లొంగుబాటులో 9 మంది మహిళలు ఉండగా, మాజీ కలెక్టర్ అలెక్స్ పాల్ మీనన్ కిడ్నాప్‌లో పాత్రధారి లోకేష్ కూడా ఉన్నారు.