గతేడాది వివిధ దేశాల నుంచి 22,900 మంది భారతీయులు బహిష్కరణకు గురై స్వదేశానికి తిరిగి వచ్చారని కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ పార్లమెంట్‌లో నివేదిక విడుదల చేసింది. అత్యధికంగా సౌదీ అరేబియా నుంచి 8,921 మంది, జెద్దా నుంచి 4,335 మంది భారతీయులు బహిష్కరణకు గురయ్యారు. యూఏఈ నుంచి 7,896 మంది దుబాయ్, 1,662 మంది అబుదాబి నుంచి తిరిగి పంపబడ్డారు. అమెరికా నుంచి 3,806 మంది, మలేసియా నుంచి 1,675 మంది, మయన్మార్ నుంచి 1,065 మంది, పలు దేశాల నుంచి 520 మంది భారతీయులు బహిష్కరణకు గురయ్యారు.