ఛత్తీస్‌గఢ్‌కు చెందిన 23 ఏళ్ల చారు పాండే అనే యువతి అసాధారణ ప్రతిభ కనబరిచి 19 ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికైంది. క్రమశిక్షణ, నిరంతర శ్రమతో ఆమె ఈ ఘనత సాధించింది. SSC, IBPS, RRB వంటి పలు ప్రతిష్టాత్మక పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన ఆమె, ఆగస్టు 15న రాష్ట్రపతి చేతుల మీదుగా గోల్డ్ మెడల్ అందుకోనుంది. ప్రస్తుతం చెన్నైలోని CAG కార్యాలయంలో అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న చారు, తన విజయ రహస్యంగా ప్రణాళికాబద్ధమైన అధ్యయనం, తప్పుల విశ్లేషణ, సమయపాలనను పేర్కొంది.