పోస్టల్ సర్కిళ్లలో 23,757 ఉద్యోగాలు.. దరఖాస్తుకు రేపే లాస్ట్

భారతీయ తపాలా శాఖ దేశవ్యాప్తంగా 23,757 గ్రామీణ డాక్ సేవక్ (GDS), BPM, ABPM పోస్టుల భర్తీకి దరఖాస్తులు స్వీకరిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో 917, తెలంగాణలో 419 ఖాళీలున్నాయి. 10వ తరగతి ఉత్తీర్ణతతో 18-40 ఏళ్ల అభ్యర్థులు సెప్టెంబర్ 21 సాయంత్రం 5 గంటలలోపు 'ఇండియా పోస్ట్ జిడిఎస్ ఆన్‌లైన్' వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఎలాంటి రాత పరీక్ష లేకుండా 10వ తరగతి మార్కుల మెరిట్ ఆధారంగా ఎంపిక జరుగుతుంది.

సంబంధిత పోస్ట్

✕
✕