శ్రీవారి సర్వ దర్శనానికి 24 గంటల సమయం (వీడియో)

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోని అన్ని కంపార్టుమెంట్లు నిండిపోయాయి. శ్రీ వెంకటేశ్వర స్వామివారి సర్వదర్శనానికి భక్తులకు సుమారు 24 గంటల సమయం పడుతోంది. స్వామివారి దర్శనానికి వచ్చిన భక్తులకు టీటీడీ అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేపట్టారు. నిన్న శ్రీవారిని 92,221 మంది భక్తులు దర్శించుకున్నారు. 3.51 కోట్ల రూపాయల హుండీ ఆదాయం వచ్చిందని టీటీడీ అధికారులు తెలిపారు.

సంబంధిత పోస్ట్