AP: తిరుమలలో గురువారం కూడా భక్తుల రద్దీ కొనసాగుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్టుమెంట్లు పూర్తిగా నిండిపోవడంతో భక్తులు వెలుపల లైన్లలో వేచి ఉన్నారు. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి సుమారు 24 గంటల సమయం పడుతోంది. కాగా నిన్న(బుధవారం) 77,502 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా, 34,485 మంది తలనీలాలు సమర్పించారు. అదే రోజు శ్రీవారి హుండీ ఆదాయం రూ.5.46 కోట్లుగా నమోదైందని టీటీడీ వెల్లడించింది.