AP: తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తుల రద్దీ కొనసాగుతోంది. గురువారం టోకెన్లు లేని భక్తులు సర్వదర్శనం కోసం 24 గంటల సమయం వేచి ఉండాల్సి వస్తోంది. కంపార్టుమెంట్లన్నీ నిండిపోవడంతో శిలాతోరణం వరకు భక్తులు లైన్లో వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 77,670 మంది భక్తులు దర్శించుకున్నారు. 33,904 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ద్వారా రూ.3.95 కోట్ల ఆదాయం లభించినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం తెలిపింది.