వేసవి సెలవులు ముగుస్తుండటంతో, తమ మొక్కులు తీర్చుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు తిరుమలకు చేరుకుంటున్నారు. దీంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్ట్‌మెంట్లు నిండిపోయాయి. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి సుమారు 24 గంటల సమయం పడుతోందని టీటీడీ అధికారులు తెలిపారు. నిన్న 89,403 మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా, 44,234 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ.4 కోట్లుగా నమోదైంది.