శ్రీవారి దర్శనానికి 24 గంటల సమయం (వీడియో)

AP: తిరుమలలో శ్రీవారి దర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. స్వామి దర్శనానికి భక్తులు భారీగా తరలివచ్చారు. దీంతో శిలా తోరణం వరకూ క్యూ లైన్లలో భక్తులు వేచి ఉన్నారు. ఆదివారం శ్రీవారిని 80,193 మంది భక్తులు దర్శించుకున్నారు. 33,298 మంది తలనీలాలు సమర్పించారు. స్వామి వారికి హుండీ ద్వారా రూ.4.43 కోట్ల ఆదాయం వచ్చిందని టీటీడీ అధికారులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్