రాష్ట్రంలో 24 శాతం లోటు వర్షపాతం

TG: రాష్ట్రంలో లోటు వర్షపాతం ఆందోళన కలిగిస్తోంది. ఈ ఏడాది అక్టోబర్ 21 నాటికి రాష్ట్రంలో 24 శాతం లోటు నమోదైంది. దీంతో వ్యవసాయం, భూగర్భజలాలు, చెరువులు, జలాశయాలు, అటవీ ప్రాంతాలపై అధిక ప్రభావం చూపుతోంది. సాధారణంగా రాష్ట్రంలో 139.28 లక్షల ఎకరాలు సాగవుతుంది. కానీ ఈ ఏడాది తాజా లెక్కల ప్రకారం కేవలం 67.78 లక్షల ఎకరాల్లోనే సాగయ్యింది. ప్రధాన పంటలైన వరిసాగు బాగా దెబ్బతింది. గతేడాది 69.89 లక్షల ఎకరాల్లో వరి సాగు చేయగా ఈ ఏడాది కేవలం 38.51 లక్షల ఎకరాలకే సాగైంది. పత్తి సాగు 10శాతం పడిపోగా, మొక్కజొన్న సాగు కూడా బాగా తగ్గింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕