ఇంపోర్టెడ్‌ ట్రక్కులపై 25% సుంకం: ట్రంప్‌

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మధ్య శ్రేణి, హెవీ డ్యూటీ ఇంపోర్టెడ్‌ ట్రక్కులపై 25 శాతం సుంకాలు విధిస్తున్నట్లు ప్రకటించారు. ఈ నిర్ణయం వచ్చే నెల 1 నుంచి అమల్లోకి రానుందని.. అమెరికాలో స్థానిక తయారీదారులను విదేశీ పోటీ నుంచి రక్షించాలనే ఉద్దేశ్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ట్రంప్‌ తెలిపారు. కాగా, అమెరికాకు ఎక్కువగా ట్రక్కులు ఎగుమతి చేసే దేశాల్లో మెక్సికో, కెనడా, జపాన్‌, జర్మనీ, ఫిన్లాండ్‌ ఉన్నాయి.

సంబంధిత పోస్ట్