కర్ణాటక రాష్ట్రంలోని ధార్వాడ నగరానికి చెందిన జీవిత కుసగుర్(26) అనే యువతి గుండెపోటుతో మరణించింది. బుధవారం ఉదయం ఛాతీనొప్పి వస్తుందని చెప్పింది. కుటుంబసభ్యులు ఆస్పత్రికి తీసుకెళ్తుండగా దారిలోనే శ్వాస వదిలింది. ఆమెను పరీక్షించిన వైద్యులు గుండెపోటుతో చనిపోయినట్లుగా ధృవీకరించారు. ఎంఎస్సీ అగ్రికల్చర్ చదువుతున్న జీవిత UPSC పరీక్షలు రాసి ఐఏఎస్ అధికారి కావాలని కలలు కంది. కానీ ఇంతలోనే గుండెపోటు రూపంలో మృత్యువు కబళించింది.