న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా హైదరాబాద్ నగరంలో డ్రంక్ అండ్ డ్రైవింగ్ ఘటనలు రికార్డు స్థాయికి చేరాయి. హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి కమిషనరేట్ల పరిధిలో పోలీసులు నిర్వహించిన ప్రత్యేక తనిఖీల్లో మొత్తం 2731 మంది మందుబాబులు పోలీసులకు చిక్కారు. వీరిలో హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 1198 మంది, సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో 928 మంది, మల్కాజిగిరి కమిషనరేట్ పరిధిలో 605 మంది ఉన్నారు. మద్యం మత్తులో వాహనాలు నడిపిన వారిపై పోలీసులు కేసులు నమోదు చేశారు