దేశ వ్యాప్తంగా పోస్టల్ సర్కిళ్లలో 28,740 గ్రామీణ డాక్ సేవక్ (GDS) ఉద్యోగాల భర్తీకి ఇండియా పోస్టు నోటిఫికేషన్ విడుదల చేసింది. పదో తరగతిలో గణితం, ఇంగ్లిష్, స్థానిక భాష సబ్జెక్టులతో ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. కంప్యూటర్ పరిజ్ఞానం, సైకిల్/బైక్ నడపడం తెలిసి ఉండాలి. వయసు 18-40 ఏళ్ల మధ్య ఉండాలి. ఫిబ్రవరి 14, 2026 లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. జనరల్ అభ్యర్థులకు రూ.100 ఫీజు. ఎంపిక పదో తరగతి మార్కుల ఆధారంగా జరుగుతుంది. జీతం రూ.10,000 నుండి రూ.29,380 వరకు ఉంటుంది.