స్కూళ్లకు వరుసగా 3 రోజులు సెలవులు?

TG: రాష్ట్రంలోని విద్యాసంస్థలకు రేపు రెండో శనివారం, ఎల్లుండి ఆదివారం సెలవు ఉన్న విషయం తెలిసిందే. అయితే హైదరాబాద్‌లోని కొన్ని ప్రాంతాల్లో సోమవారం కూడా సెలవు ఉండే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. సికింద్రాబాద్‌లోని ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయంలో బోనాల పండుగ ఆది, సోమవారాల్లో జరగనుంది. దీంతో సోమవారం ఆ ప్రాంతంలోని విద్యాసంస్థలకు సెలవు ఉండే ఛాన్స్ ఉంది. సెలవు ప్రకటిస్తే వారికి మూడు రోజులు వరుస సెలవులు ఉండనున్నాయి.

సంబంధిత పోస్ట్