దక్షిణ మధ్య రైల్వే అధికారులు రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పారు. యూటీఎస్ (UTS) యాప్‌లో ఆర్–వాలెట్ ద్వారా ట్రైన్ టికెట్లు బుక్ చేసుకునేవారికి 3 శాతం క్యాష్ బ్యాక్ లభిస్తుందని తెలిపారు. ఈ విషయాన్ని దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్‌ఓ సీహెచ్ శ్రీధర్ ఓ ప్రకటనలో వెల్లడించారు. అలాగే ఈ యాప్‌లో దాదాపు రూ.20 వేల వరకు డిపాజిట్ చేసుకోవచ్చని అన్నారు. దాదాపు రోజు 93,487 మంది టికెట్లు కొనుగోలు చేస్తున్నారన్నారు.