మేడారం జాతరలో 30 మెడికల్ క్యాంపులు ఏర్పాటు

TG: మేడారం జాతరకు భారీ సంఖ్యలో భక్తులు రానుండటంతో ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. వారికి వైద్యపరంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని నిర్ణయించింది. అన్ని రూట్లలో మెడికల్ క్యాంపులు ఏర్పాట్లు చేయాలని అధికారులను మంత్రి రాజనర్సింహ ఆదేశించారు. TTD కళ్యాణ మండపంలో 50 పడకలతో ప్రధాన ఆస్పత్రి, మరో రెండు చోట్ల మినీ హాస్పిటళ్లు, మొత్తం 30 మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేశారు. 35 అంబులెన్సులు, 3,199 మంది సిబ్బంది అందుబాటులో ఉండనున్నారు.

సంబంధిత పోస్ట్