తెగిపడిన విద్యుత్ వైర్లు.. 30 మంది విద్యార్థినులకు కరెంట్ షాక్

AP: అంతర్వేదిపాలెం వద్ద మొంథా తుఫాన్ తీరాన్ని తాకింది. ఈ తుఫాన్ ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ ఈదురుగాలులకు విజయనగరం జిల్లా గుర్లలోని కస్తూరిబా పాఠశాలలో విద్యుత్ వైర్లు తెగిపడ్డాయి. గోడను పట్టుకున్న సుమారు 30 మంది విద్యార్థినులకు కరెంట్ షాక్ తగిలింది. అధికారులు విద్యార్థినులను విజయనగరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్