TG: హైదరాబాద్ మూసాపేట పరిధి భరత్‌నగర్‌లో చికెన్ సెంటర్‌పై ఆహార కల్తీ నిఘా పోలీసులు దాడులు నిర్వహించి, సూరజ్ పాల్ అనే వ్యక్తిని అరెస్టు చేశారు. అతని వద్ద నుండి 352 కిలోల కుళ్ళిన మాంసాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ మాంసాన్ని అపరిశుభ్ర వాతావరణంలో నిల్వ ఉంచి, స్థానిక హోటళ్లు, విక్రేతలకు సరఫరా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడి వద్ద ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ లైసెన్స్ గడువు కూడా ముగిసినట్లు తెలిపారు.