కేంద్ర సాయుధ బలగాలలో అసిస్టెంట్ కమాండెంట్ పోస్టుల భర్తీకి యూపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టుల భర్తీకి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకాగా.. మార్చి 25 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. డిగ్రీ ఉత్తీర్ణులైన పురుష, మహిళా అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాలి. ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేదీ: 25.03.2025. దరఖాస్తు సవరణ తేదీలు: 26.03.2025 నుంచి 01.04.2025, రాతపరీక్ష 03.08.2025న ఉంటుంది.