దక్షిణ కొరియాలోని డేగూ నగరంలో ఒక షాపింగ్ మాల్లో పైకప్పు కూలిపోవడంతో సుమారు 38 మంది గాయపడ్డారు. ఈ ఘటన శనివారం ఉదయం 10.16 గంటలకు జరిగింది. ప్లాస్టర్ సీలింగ్ కూలిపోవడంతో ఈ ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో చిక్కుకున్న 66 మందిని సురక్షితంగా తరలించినట్లు డేగూ అగ్నిమాపక శాఖ తెలిపింది. గాయపడిన వారికి వివిధ ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నారు. గాయపడిన వారి సంఖ్య పెరిగే అవకాశం ఉందని, అయితే తీవ్రంగా గాయపడిన వారు ఎవరూ లేరని అధికారులు తెలిపారు.