దేశవ్యాప్తంగా జూన్ 12 నుంచి AUG 31 వరకు నిర్వహించిన ప్రత్యేక 'పాన్-ఇండియా రెస్క్యూ అండ్ రిహాబిలిటేషన్' క్యాంపెయిన్లో భాగంగా 3,800 మందికి పైగా బాలకార్మికులను విముక్తి లభించింది. జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ (NCPCR) బాలకార్మిక హాట్స్పాట్లలో ప్రత్యేక దాడులు చేపట్టి, బాధ్యులపై 575కు పైగా ఎఫ్ఐఆర్లు నమోదు చేసింది. రక్షించిన చిన్నారులకు పునరావాసం, విద్య, నష్టపరిహారం అందించే ప్రక్రియపై రాష్ట్రాలు, జిల్లా యంత్రాంగాలతో నిరంతర పర్యవేక్షణ చేపట్టింది.