'వయ్యారాల జాబిల్లి ఓణి కట్టి' సాంగ్ లిరిక్స్

వయ్యారాల జాబిల్లి ఓణి కట్టి
గుండెల్లోన చేరావే గంటే కొట్టి
ఆ నండూరి వారెంకి మళ్ళీ పుట్టి
కవ్వింతల్లో ముంచావే కళ్ళే మీటి

నదివలె కదిలా నిలబడక
కలలను వదిలా నిను వెతికా

వయసే వరస మార్చినదే
మనసే మధువు చిలికినదే
అడుగే జతను అడిగినదే
అలలై తపన తడిపినదే

వయ్యారాల జాబిల్లి ఓణి కట్టి
గుండెల్లోన చేరావే గంటే కొట్టి
ఆ నండూరి వారెంకి మళ్ళీ పుట్టి
కవ్వింతల్లో ముంచావే కళ్ళే మీటి

నీ పరిచయమే ఓ పరవశమై
జగాలు మెరిసెనులే
నా ఎద గుడిలో
నీ అలికిడిని పదాలు పలుకవులే

అణువణువూ చెలిమి కొరకు
అడుగడుగూ చెలికి గొడుగు

ఇది వరకూ గుండె లయకు
తెలియదులే ఇంత పరుగు

వయసే వరస మార్చినదే
మనసే మధువు చిలికినదే

వయ్యారాల జాబిల్లి ఓణి కట్టి
గుండెల్లోన చేరావే గంటే కొట్టి
ఆ నండూరి వారెంకి మళ్ళీ పుట్టి
కవ్వింతల్లో ముంచావే కళ్ళే మీటి

నీ ప్రతి తలపు నాకొక గెలుపై
చుగాలు తొణికేనులే

నీ శ్రుతి తెలిపే కోయిల పిలుపే
తధాస్తు పలికేనులే

గగనములా మెరిసి మెరిసి
పవనములా మురిసి మురిసి

నిను కలిసే క్షణము తలచి
అలుపు అనే పదము మరిచి

వయసే వరస మార్చినదే
మనసే మధువు చిలికినదే

చిత్రం : తీన్ మార్ (2011)
సంగీతం : మణిశర్మ
సాహిత్యం : రహ్మాన్
గానం : కారుణ్య

సంబంధిత పోస్ట్