ఆప్ఘనిస్తాన్‌లో 4.5తో భూకంపం

ఆఫ్ఘనిస్తాన్‌లో శుక్రవారం ఉదయం భూకంపం సంభవించింది. రిక్టర్‌స్కేల్‌పై భూకంప తీవ్రత 4.5గా నమోదైందని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సిస్మాలజీ (ఎన్‌సిఎస్‌) వెల్లడించింది. భూకంపం కారణంగా స్థానికులు భయాందోళనకు గురయ్యారు. వెడల్పు 37.41, పొడవు : 73:29, లోతు : 90 కిలోమీటర్లుగా ఎన్‌సిఎస్‌ ఎక్స్‌లో పోస్టు చేసింది. ఈ భూకంపం వల్ల ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని అధికారులు తెలిపారు.

సంబంధిత పోస్ట్