ఈవీ రంగంలో 4 కోట్ల ఉద్యోగాలు: అడెక్కో రిపోర్ట్

ఎలక్ట్రానిక్ వెహికల్స్ (ఈవీ) పరిశ్రమ 2030 నాటికి నాలుగు కోట్ల మందికి ఉపాధి కల్పించే అవకాశం ఉందని అడెక్కో ఇండియా నివేదిక వెల్లడించింది. ఏటా నియామకాలు 15-20% వృద్ధి చెందుతాయని, ఇంజనీరింగ్, ఎనర్జీ సిస్టమ్స్, బ్యాటరీ టెక్నాలజీ నిపుణులకు అత్యధిక డిమాండ్ ఉంటుందని ఈ నివేదిక పేర్కొంది. "తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్, తెలంగాణ, ఢిల్లీలలో ఈవీలకు 55% డిమాండ్ ఉంది. గిగా ఫ్యాక్టరీలు, బ్యాటరీ రీసైక్లింగ్ యూనిట్లు కొత్త ఉపాధి మార్గాలను తెరుస్తున్నాయి. మేక్ ఇన్ ఇండియా చొరవతో ముడి చమురు దిగుమతుల భారం తగ్గుతుంది. నెట్-జీరో ఉద్గారాల లక్ష్య సాధనకు ఈ రంగం తోడ్పడుతుంది" అని నివేదిక చెప్పింది.

సంబంధిత పోస్ట్