ఎయిడ్స్ నివారణకు అనేక దేశాల్లో కొనసాగుతున్న అమెరికా సహాయాన్ని ట్రంప్ ప్రభుత్వం నిలిపివేయడం ఆందోళన కలిగిస్తోంది. హెచ్ఐవీ నియంత్రణ నిధులు తిరిగి అందుబాటులోకి రాకపోతే, 2029 నాటికి 40 లక్షల మరణాలు, 60 లక్షల కొత్త హెచ్ఐవీ కేసులు నమోదయ్యే ప్రమాదం ఉందని ఐరాస హెచ్ఐవీ విభాగం హెచ్చరించింది. ఈ నిర్ణయం ప్రపంచ వ్యాప్తంగా హెచ్ఐవీతో పోరాటం చేస్తున్న దేశాలకు తీవ్ర ఇబ్బందిగా మారే అవకాశం ఉంది.