40 లక్షల టన్నుల బొగ్గు మాయం.. విచారణకు బీఆర్‌ఎస్‌ డిమాండ్‌

TG: రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభానికి సింగరేణిలో బొగ్గు ఉత్పత్తి తగ్గడమే కారణమని బీఆర్‌ఎస్ నేతలు ఆరోపించారు. గురువారం సింగరేణి ప్రధాన కార్యాలయం వద్ద మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. సింగరేణి నిల్వల్లో కనిపించకుండా పోయిన 40 లక్షల టన్నుల బొగ్గుపై విచారణ నివేదికను బహిర్గతం చేయాలని కొప్పుల ఈశ్వర్ డిమాండ్ చేశారు. దాని విలువ సుమారు రూ.1,600 కోట్లుగా పేర్కొన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే తెలంగాణ వ్యాప్తంగా విద్యుత్ సమస్య తీవ్రమైందని మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి ఆరోపించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕