TG: రాష్ట్రంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు తెలంగాణ PCC సాధించిన విజయమని AICC ఇన్ చార్జ్ మీనాక్షి నటరాజన్ తెలిపారు. మన హక్కు కోసం కదం తొక్కాలని.. కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు ఢిల్లీలో పోరాడాలని పిలుపునిచ్చారు. సామాజిక న్యాయం కోసం కేంద్రంలో కాంగ్రెస్ పోరాడుతోందని చెప్పారు. వికారాబాద్(D) పరిగి నియోజకవర్గంలో జనహిత పాదయాత్ర చేసి మాట్లాడారు. TPCC చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రి శ్రీధర్ బాబు పాదయాత్రలో పాల్గొన్నారు.