సివిల్స్ మెయిన్ పరీక్షల్లో తెలంగాణ నుంచి 43 మంది అభ్యర్థుల ఎంపిక

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) నిర్వహించిన సివిల్ సర్వీసెస్ మెయిన్ పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. దేశవ్యాప్తంగా ఆగస్టు 22 నుంచి 31 వరకు జరిగిన పరీక్షల్లో మొత్తం 2,736 మంది అభ్యర్థులు ఇంటర్వ్యూలకు ఎంపికయ్యారు. వీరిలో తెలంగాణ నుంచి 43 మంది అభ్యర్థులు ఉన్నారు. వీరంతా రాజీవ్‌ గాంధీ సివిల్స్ అభయ హస్తం పథకం కింద సహాయం పొందిన వారేనని ప్రభుత్వం తెలిపింది. అభ్యర్థుల వివరాలను UPSC వెబ్‌సైట్‌లో ఉంచింది.

సంబంధిత పోస్ట్