సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను దేశవ్యాప్తంగా 4,500 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు ఒక సంవత్సరం పాటు శిక్షణ ఇవ్వబడుతుంది. ఆంధ్రప్రదేశ్‌లో 128, తెలంగాణలో 100 పోస్టులు కేటాయించారు. గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా విభాగంలో డిగ్రీ ఉత్తీర్ణులైన వారు, 01-01-2022 లేదా ఆ తర్వాత డిగ్రీ పూర్తి చేసినవారు దరఖాస్తు చేసుకోవచ్చు. 31-05-2026 నాటికి అభ్యర్థుల వయస్సు 20 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి. దరఖాస్తు చివరి తేదీ 22.06.2026.