5 రోజులు.. 3 లక్షల వాహనాలు

హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారిపై ఐదు రోజుల పాటు వాహనాల రద్దీ కొనసాగింది. శనివారం ఒక్కరోజే అత్యధికంగా 71,284 వాహనాలు వెళ్లాయి. ఐదు రోజుల్లో మొత్తం 3.04 లక్షల వాహనాలు పంతంగి టోల్‌ప్లాజా మీదుగా రాకపోకలు సాగించాయి. వీటిలో 2.04 లక్షల వాహనాలు విజయవాడ వైపు వెళ్లాయి. అండర్‌పాస్‌ వంతెనల నిర్మాణ పనుల కారణంగా వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకున్నారు. బుధవారం వాహనాల రద్దీ సాధారణంగానే ఉంది. గత ఏడాదితో పోలిస్తే ఈసారి భారీగా వాహనాలు వెళ్తాయని పోలీసులు అంచనా వేశారు.

సంబంధిత పోస్ట్