హర్యానాలోని పాల్వాల్‌లో 5 కిలోమీటర్ల పొడవైన భారత త్రివర్ణ పతాకాన్ని ప్రదర్శించి గిన్నిస్ వరల్డ్ రికార్డు నెలకొల్పారు. వేలాది మంది ప్రజలు జాతీయ జెండాను చేతబట్టి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పాల్వాల్ ప్రాంతం దేశభక్తి నినాదాలతో మార్మోగింది. చిన్నా, పెద్దా తేడా లేకుండా ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొని జాతీయ జెండాపట్ల గౌరవాన్ని చాటుకున్నారు. ఈ అరుదైన ఘట్టం భారతీయుల ఐక్యత, దేశభక్తి, జాతీయ గౌరవానికి ప్రతీకగా నిలిచింది.