భగవద్గీతను ఆధునికంగా పరిచయం చేయడానికి దర్శకుడు రామ్ మాధ్వానీ కొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా 5 నిమిషాల నిడివి కలిగిన షార్ట్‌ఫిల్మ్‌ను రూపొందించనున్నారు. ఈ చిత్రంలో భగవద్గీతలోని మొత్తం 18 అధ్యాయాలను సంక్షిప్తంగా, అంతరార్థంతో చూపించనున్నట్టు వెల్లడించారు. AI టెక్నాలజీతో భగవద్గీతను నేటి ప్రపంచానికి చేరవేయాలనే లక్ష్యంతో ఈ ప్రయత్నం చేస్తున్నట్టు ఆయన తెలిపారు.