AP: కాకినాడలోని రంగరాయ వైద్యకళాశాలలో కీచక పర్వం చోటుచేసుకుంది. 50 మంది పారా మెడికల్ విద్యార్థినులు నెల రోజులుగా లైంగిక వేధింపులకు గురయ్యారు. తమ శరీర భాగాల ఫొటోలను వాట్సాప్‌కు పంపి కోరిక తీర్చాలని, లేకుంటే పరీక్షల్లో ఫెయిల్ చేస్తామని బెదిరించారని విద్యార్థినులు ప్రిన్సిపాల్‌కు ఈ నెల 8న ఫిర్యాదు చేశారు. విచారణలో నిజమని తేలితే ల్యాబ్ అటెండెంట్, టెక్నీషియన్లను సస్పెండ్ చేస్తామని ప్రిన్సిపాల్ తెలిపారు.