AP: కాకినాడ జిల్లా కాజులూరు మండలం దుగ్గుదుర్రు గ్రామంలో శనివారం సాయంత్రం కాక హోటల్లో పునుగులు తిన్న సుమారు 50 మంది గ్రామస్తులు ఫుడ్ పాయిజన్ కారణంగా అస్వస్థతకు గురయ్యారు. కడుపునొప్పి, వాంతులు, విరేచనాలతో బాధపడిన వారిని ప్రాథమిక చికిత్స కేంద్రానికి తరలించగా, వైద్యుల సకాలంలో చికిత్సతో అందరూ కోలుకున్నారు. ఆహారమే దీనికి కారణమని వైద్యులు నిర్ధారించారు. కాకినాడ డీఎంహెచ్‌ఓ నాయక్ బాధితులను పరామర్శించి, మెరుగైన వైద్యం అందించాలని సూచించారు.