ప్రముఖ శైవక్షేత్రం కేదార్నాథ్లో యాత్రికుల రద్దీతో చెత్తాచెదారం భారీగా పెరుగుతోంది. ఈ ఏడాది ఏప్రిల్-ఆగస్టు మధ్య ఐదు నెలల్లోనే 50.30 మెట్రిక్ టన్నుల వ్యర్థాలు పేరుకుపోయినట్లు ఆర్టీఐ ద్వారా వెల్లడైంది. 2023లో 32.58, 2024లో 26.10, 2025లో 21.40 టన్నుల వ్యర్థాలు నమోదయ్యాయి. ఈ ఏడాది ఇప్పటివరకు సుమారు 15 లక్షల మంది కేదార్నాథ్ను సందర్శించినట్లు సమాచారం. వ్యర్థాల్లో 20 టన్నుల వరకు ప్లాస్టిక్ ఉన్నట్లు అధికారులు తెలిపారు.