NICLలో 500 అసిస్టెంట్ పోస్టులు.. రేపే చివరి గడువు తేదీ

నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ (NICL)లో 500 అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తు గడువు రేపటితో ముగియనుంది. ఆంధ్రప్రదేశ్‌లో 14, తెలంగాణలో 15 ఖాళీలు ఉన్నాయి. ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు 21 నుంచి 30 ఏళ్ల వయసు ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. SC, ST, PwBD అభ్యర్థులకు ఫీజు లేదు, మిగతా వారికి రూ.850. ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షల ఆధారంగా ఎంపిక జరుగుతుంది. పూర్తి వివరాలకు వెబ్‌సైట్: nationalinsurance.nic.co.in చూడగలరు.

సంబంధిత పోస్ట్