తెలంగాణలోని విశ్వవిద్యాలయాల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేసేందుకు రేవంత్ సర్కార్ కసరత్తు చేస్తోంది. కాంట్రాక్టు లెక్చరర్లను యథాతథంగా కొనసాగిస్తూనే.. మిగిలిన ఖాళీలను భర్తీ చేయాలని గతంలోనే నిర్ణయించిన ప్రభుత్వం.. మరో 500 అసిస్టెంట్ ప్రొఫెసర్ల పోస్టుల్లో నియామకం చేపట్టనుంది. ఈ బడ్జెట్ సమావేశాల్లోనే పోస్టుల భర్తీపై నిర్ణయం తీసుకుంటారని సమాచారం.