ఆశా వర్కర్లు, అంగన్వాడీ కార్యకర్తలకు కేంద్రం శుభవార్త చెప్పింది. ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన కింద వీరికి ఆరోగ్య బీమా అందజేస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. 2024 మధ్యంతర బడ్జెట్‌లో ఈ అంశాన్ని ప్రస్తావించారు. ఈ స్కీమ్ ద్వారా రూ.5 లక్షల వరకు చికిత్స పొందవచ్చు. కాగా, గతేడాది ఈ స్కీమ్ ద్వారా 55 కోట్ల మంది లబ్ది పొందారు.