రష్యా సైన్యంలో చేరిన 227 మంది భారతీయుల్లో ఇప్పటివరకు 51 మంది మరణించారని విదేశాంగ శాఖ సెక్రటరీ విక్రమ్ మిశ్రీ వెల్లడించారు. మరో 139 మంది సైన్యం నుంచి బయటకు వచ్చారని తెలిపారు. మిగిలిన వారిని కూడా స్వదేశానికి తీసుకురావడానికి రష్యాతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామని చెప్పారు. భారత రాయబార కార్యాలయం ఈ ప్రక్రియను పర్యవేక్షిస్తోందని పేర్కొన్నారు.