జమ్ముకాశ్మీర్‌లో చిక్కుకున్న 52 మంది తమిళనాడు విద్యార్థులు

తమిళనాడుకు చెందిన 52 మంది విద్యార్థులు జమ్ముకాశ్మీర్‌లో చిక్కుకున్నారు. అక్కడ ఉన్నత విద్య అభ్యసిస్తున్న 52 మంది విద్యార్థులు, ఎడ్యుకేషన్‌ టూర్‌ కోసం అక్కడకు వెళ్లిన మరో నలుగురు విద్యార్థులు చిక్కుకున్నట్లు తమిళనాడు ప్రభుత్వం తెలిపింది. భారత్‌, పాకిస్థాన్‌ మధ్య ఉద్రిక్తతలు పెరుగడంతో జమ్ముకశ్మీర్‌లో విమాన సర్వీసులు నిలిచిపోయాయి. దీంతోె వారిని సురక్షితంగా తీసుకురావడానికి చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొంది. హెల్ప్‌లైన్ నంబర్లు ఏర్పాటు చేసింది.

సంబంధిత పోస్ట్