TG: హైదరాబాద్‌లోని కుషాయిగూడ బస్టాండ్‌లో శుక్రవారం 54 అడుగుల వీరాంజనేయుడి విగ్రహ ప్రతిష్ఠాపన జరిగింది. ఈ సందర్భంగా భక్తి పారవశ్యం నెలకొంది. యువత కాషాయ జెండాలతో 'జై హనుమాన్' నినాదాలు చేశారు. రామ నామ స్మరణతో ఆ ప్రాంతం మార్మోగింది. భారీ ఆంజనేయ విగ్రహం భక్తులకు ఆధ్యాత్మిక శోభను పంచుతోంది.