AP: తిరుమల శ్రీవారి దర్శనార్థం వచ్చిన భక్తుల కోసం ప్రస్తుతం 4 కంపార్టుమెంట్లలో వేచివున్నారు. టోకెన్ లేని భక్తులకు సర్వదర్శనానికి సుమారు 6 గంటల సమయం పడుతోంది. ఇక గడచిన నిన్నటి వివరాల ప్రకారం, మొత్తం 72,806 మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా, 18,564 మంది భక్తులు తమ తలనీలాలు సమర్పించారు. అలాగే మంగళవారం శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.89 కోట్లుగా నమోదైనట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. భక్తుల రద్దీ దృష్ట్యా అన్ని ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.