తిరుమల శ్రీవారి దర్శనానికి 6 గంటలు

AP: తిరుమలలో బుధవారం భక్తుల రద్దీ గణనీయంగా తగ్గింది. టోకెన్లు లేని భక్తులు శ్రీవారి సర్వదర్శనం కోసం సుమారు 6 గంటలు వేచి ఉండాల్సి వస్తోంది. ప్రస్తుతం వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని 4 కంపార్టుమెంట్లలో భక్తులు ఉన్నారు. మంగళవారం 73,519 మంది స్వామివారిని దర్శించుకోగా, 21,564 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ.4.30 కోట్లు వచ్చినట్లు టీటీడీ వెల్లడించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్